డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్న విష్వక్ సేన్

‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ నుంచి ‘పాగ‌ల్’ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విష్వ‌క్ సేన్. అతను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఎద‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడు. శ‌నివారం ఈ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో హీరో విష్వ‌క్ సేన్ ఇది వ‌ర‌కు చేసిన చిత్రాల‌కు భిన్న‌మైన లుక్‌, పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. టైటిల్ పోస్ట‌ర్‌లో విష్వ‌క్ లుక్‌తో పాటు త‌ను ఏం ప‌ని చేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాడు అని తెలిసేలా వివ‌రాల‌ను కార్డులో పొందుప‌రిచారు. ఇక మోషన్ పోస్టర్ లో అయితే… పెళ్ళికాని ప్రసాద్ గా ‘మల్లీశ్వరి’లో వెంకటేశ్ పడిన బాధలన్నీ ఇందులో కనిపించేలా చూపించారు. జై క్రిష్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి ప‌వి కె. ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-