విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రారంభం

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటీఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు విద్యా సాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్ చిత్రాలతో అలరించిన విశ్వక్ సేన్ ఇప్పుడు క్లాస్ టైటిల్ తో రావడం విశేషం. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నిన్న ప్రారంభమైంది. ఇక గతంలో ‘ఫలక్ నుమా దాస్, హిట్’ చిత్రాలతో హిట్లు తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించబోయే ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని దిల్ రాజు సమర్పించారు లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం 1 మే 2021 న థియేటర్లలో విడుదల కానుంది

-Advertisement-విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రారంభం

Related Articles

Latest Articles