రణబీర్ తో దూరంగా ఎటైనా వెళ్లిపోవాలని ‘ఆశ’పడుతోన్న బుల్లితెర బ్యూటీ!

ఆమె పేరులోని ఆశ మాటల్లోనూ మార్మోగింది. ఇంతకీ, అందగత్తె కోరిక ఏంటో తెలుసా? రణబీర్ కపూర్ తో కలసి ‘తమాషా’ సినిమాలో మాదిరిగా రోడ్ ట్రిప్ వేయాలనుకుంటోందట! అంతే కాదు, పర్వత ప్రాంతమైతే ఇంకా మంచిదట! ఆమెకు ప్రకృతి అంటే ఇష్టం కాబట్టి తన అభిమాన హీరో రణబీర్ తో కలసి ప్రకృతి ఒడిలో, పర్వతారోహణలు చేస్తూ మథురమైన అనుభూతులు మూటగట్టుకోవాలని ఉందట! ఇంతకీ, ఇదంతా అంటోంది ఎవరంటారా? ఆశా నెగీ!
ఆశ ఎవరో మనకు తెలిసే అవకాశాలు తక్కువే. కానీ, హిందీ సీరియల్స్ చూసే బుల్లితెర ప్రేక్షకులకి హాట్ ఫేవరెట్. పలు సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించింది. ఇప్పుడు క్రమంగా కెరీర్ ని విస్తరిస్తోంది. తాజాగా ఆశా నెగీ నటించిన ‘క్వాబోంకే పరిందే’ ఆన్ లైన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ లో ఆశ నెగీతో సహా మరికొందరు ఓ కారవాన్ లో మెల్ బోర్న్ నుంచీ పెర్త్ కి ప్రయాణిస్తారు. ఆస్ట్రేలియాలోని అందమైన లోకేషన్స్ లో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ.

తాను నటించిన వెబ్ సిరీస్ లో మాదిరిగానే, ఓ కారవాన్ లో, తన ఆల్ టైం అందగాడు రణబీర్ తో ఆశా నెగీ కొండలు, గుట్టలు చుట్టేయాలనుకుంటోంది! అదీ అతడి ఎక్స్ గాళ్ ఫ్రెండ్ దీపికా పదుకొణే ‘తమాషా’ చిత్రంలో తిరిగిన్నంత క్లోజ్ గా! ఇవన్నీ వింటోన్న రణబీర్ ప్రజెంట్ ప్రియురాలు, ఆలియా భట్, ఏమనుకుంటోందో మరి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-