ఆర్య బాక్సింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో….

హీరో ఆర్య, డైరెక్టర్ పా. రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సర్పట్ట పరంబరై’ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తోంది. ఈ విషయాన్ని చూచాయగా రెండు మూడు రోజుల నుండి చెబుతున్న చిత్ర నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 22న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. 1980 ప్రాంతంలో నార్త్ చెన్నయ్ లో బాక్సింగ్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో ఒకే కుటుంబానికి చెందిన ఇదియప్ప పరంబరై, సర్పట్ట పరంబరై మధ్య ఎలాంటి వైరం ఏర్పడింది? బాక్సింగ్ పోరాటంలో ఎవరిది పై చేయి అయ్యింది? అనే నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

రజనీకాంత్ తో ‘కాలా’ తీసిన తర్వాత పా. రంజిత్ తెరకెక్కించిన సినిమా ఇదే. మొదట ఈ కథను కార్తీ తీయాలని పా. రంజిత్ అనుకున్నా అతను బిజీగా ఉండటంతో ఆర్యకు వినిపించాడు. ఆర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాడు కూడా. ఇందులో బాక్సర్ గా నటించడానికి దాదాపు ఏడు నెలల పాటు రోజుకు ఆరు గంటల చొప్పున ఆర్య వ్యాయామం చేశాడని చెబుతున్నారు. దాంతో పాత్రకు తగ్గట్టుగా ఆర్య బాగా స్లిమ్ అయ్యాడు. ఇటీవల వచ్చిన ప్రచార చిత్రాలకూ మంచి స్పందన లభించింది. తొలుత థియేటర్లలోనే ‘సర్పట్ట పరంబరై’ను విడుదల చేయాలని అనుకున్నా… తమిళనాడులో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టని కారణంగా చివరకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కే దర్శక నిర్మాతలు మొగ్గుచూపారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా అదే రోజున ప్రసారం కాబోతోంది. సంజనా నటరాజన్, కలైయారసరన్, కాళీ వెంకట్, సంతోష్ ప్రతాప్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘సర్పట్ట పరంబరై’కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-