అర్షద్ వార్సీ ‘అసుర్’ సీజన్ 2 షురూ…

బోలెడంత టాలెంట్ ఉండి కూడా హీరోలు, స్టార్స్ అవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ డిజిటల్ ప్రపంచంలో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అదే బాటలో ప్రయాణిస్తున్నాడు అర్షద్ వార్సీ. బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై బిగ్ సక్సెస్ ఆయనకి పెద్దగా రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, వెబ్ సిరీస్ ల శకం మొదలు కావటంతో ‘అసుర్’ రూపంలో అర్షద్ కు అదృష్టం కలసి వచ్చింది…

2020లో వూట్ సెలెక్ట్ ఓటీటీలో ‘అసుర్’ స్ట్రీమింగ్ అయింది. మైథాలజీ, ప్రాక్టికాలిటి, సైన్స్ … మూడూ కలగలిపి రూపొందించారు వెబ్ సిరీస్ మేకర్స్. అర్షద్ వార్సీ ధనుంజయ్ సింగ్ పాత్ర పోషించాడు. ‘అసుర్’ సిరీస్ సూపర్ సక్సెస్ అయింది. దాంతో ఇప్పుడు ‘అసుర్ 2’కి శ్రీకాం చుట్టారు. టీమ్ మొత్తం ఆల్రెడీ షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ‘అసుర్’ తన జీవితంలో జరిగిన ఓ గొప్ప శుభ పరిణామం అన్నాడు అర్షద్ వార్సీ. ఓనీ సేన్ దర్శకత్వం వహిస్తోన్న ‘అసుర్ సీజన్ 2’ కూడా సక్సెస్ అయితే ఇక అర్షద్ కి తిరుగుండదనే చెప్పాలి. ఓటీటీల్లో ఆయన మరిన్ని ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు చేసే ఛాన్స్ లభిస్తుంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-