కోవిడ్‌ కలకలం.. 5 రోజుల్లో 242 మంది చిన్నారులకు పాజిటివ్

కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్‌ వేవ్‌లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు చెబుతున్నారు.. పాజిటివ్‌గా తేలినవారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్లవారు 136 మంది ఉన్నారు.. బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇక, కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు ఉండడం.. ఈసారి చిన్నారులపైనే అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. ఐదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో చిన్నారులు కోవిడ్ బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది.. దీంతో అప్రమత్తమైన అధికారులు చిన్నారులను ఇళ్లలోనే ఉంచాటని సూచిస్తున్నారు. ఈ కేసులో మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విలయం సృష్టించిన సమయంలో.. కర్ణాటకలోనూ పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles