అర్జున్ క‌పూర్ కెరీర్ గ్రాఫ్ డౌన్!

బాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు బోనీ క‌పూర్ త‌న‌యుడు అర్జున్ క‌పూర్. గ‌త తొమ్మిదేళ్ళ‌లో చేసిన‌వి కొన్ని చిత్రాలే అయినా అత‌ని కంటూ ఓ గుర్తింపు ఉంది. అయితే కొంత‌కాలంగా అర్జున్ క‌పూర్ వ్య‌క్తిగ‌త జీవితం… అత‌ని ప్రొఫెష‌న్ కంటే కూడా ఎక్కువ‌గా వార్త‌ల‌లో నానుతోంది. దానికి తోడు ఈ పేండ‌మిక్ సిట్యుయేష‌న్ లో అర్జున్ న‌టించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోది సైతం ఓటీటీకే ప‌రిమితం కాబోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అర్జున్ క‌పూర్ మార్కెట్ కు బాగా దెబ్బ‌ప‌డే ఛాన్స్ ఉంద‌ని, అదే స‌మ‌యంలో అత‌ని కెరీర్ గ్రాఫ్ కింద‌కు ప‌డిపోతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అర్జున్ క‌పూర్, ప‌రిణితీ చోప్రా ప్రధాన పాత్ర‌లు పోషించిన సందీప్ అండ్ పింకీ ఫరార్ చిత్రం మార్చి 19న ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా, మే 18న మ‌రో సినిమా స‌ర్దార్ కా గ్రాండ్ స‌న్ విడుద‌లైంది. ఈ రెండు పెద్దంత ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. ఇప్పుడు మూడో సినిమా కూడా అదే జాబితాలో చేర‌బోతోంద‌ట‌. అర్జున్ క‌పూర్ న‌టిస్తున్న భూత్ పోలీస్ సైతం జులైలో ఓటీటీలో విడుద‌ల అవుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది కాకుండా అర్జున్ క‌పూర్ ఏక్ విల‌న్ రిట‌ర్న్స్లో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. మ‌రి ఆ సినిమా అయినా థియేట్రిక‌ల్ రిలీజ్ అయ్యి, అర్జున్ క‌పూర్ కెరీర్ గ్రాఫ్ ను పైకి తీసుకెళుతుందేమో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-