తాజా ప‌రిశోధ‌న: క‌రోనా నుంచి కోలుకున్న వారికి ఆ వ్యాక్సిన్ సింగిల్ డోసు చాలు…

క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోవాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.  ప్ర‌స్తుతానికి వ్యాక్సిన్ ఒక్క‌టే ర‌క్ష‌ణ మార్గం కావ‌డంతో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ల‌ను వేగంగా అందిస్తున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారికి మొద‌ట‌గా వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన దేశం ర‌ష్యా.  స్పుత్నిక్ వీ పేరుతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  అయితే, ఈ వ్యాక్సిన్‌కు సంబందించి ట్ర‌య‌ల్స్‌ను బ‌య‌ట‌కు ఇవ్వ‌క‌పోవ‌డంతో అనేక దేశాలు స్పుత్న‌క్ వీ ని ఆమోదించ‌లేదు.  

Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య

అటు ప్రపంచ ఆరోగ్య‌సంస్థ కూడా ర‌ష్యా వ్యాక్సిన్‌కు ఆమోదం తెల‌పలేదు. అయిన‌ప్ప‌టికీ అనేక దేశాలు స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నాయి.  ఈ వ్యాక్సిన్‌పై అర్జెంటైనా ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేశారు.  క‌రోనా నుంచి కోలుకున్న వారికి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఒక‌డోసు ఇస్తే స‌రిపోతుంద‌ని, రెండో డోస్ తీసుకున్నా ఉప‌యోగం ఉండ‌ద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఈ ప‌రిశోధ‌న‌ల‌కు సంబందించి పూర్తి వివ‌రాల‌ను సైన్స్ డైరెక్ట్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.  క‌రోనా నుంచి కోలుకున్నాక స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే 94 శాతం ప్ర‌భావం ఉంటుంద‌ని అర్జెంటైనా ప‌రిశోధ‌కులు, ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-