“రాధే శ్యామ్” ఆలస్యంగా రాబోతున్నాడా ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాభే శ్యామ్”. ఈ సినిమా దాదాపుగా రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం జూలై 30 న విడుదల కావాల్సి ఉంది. కాని రెండవ వేవ్ కారణంగా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. అయినప్పటికీ సినిమా విడుదలలో ఇంకా జాప్యం జరగొచ్చు అని ప్రచారం జరుగుతోంది.

Read Also : “అధీరా” కోసం అదిరిపోయే ప్లాన్ !

ఈ చిత్రం పీరియడ్ డ్రామా, సినిమాకు చాలా వరకు విఎఫ్ఎక్స్ అవసరం. అందుకే షూటింగ్ దాదాపు పూర్తయినప్పటికీ, విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఎక్కువగా విదేశాల్లో జరుగుతున్నాయి. అక్కడ కోవిడ్ ఆంక్షల కారణంగా ఇంకా పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా మరింత ఆలస్యం అవుతుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా నుంచి అప్డేట్ రావాలని ఆశిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ కోసం వేరే ప్లానింగ్ లో ఉన్నారు. “రాధే శ్యామ్” రాధా కృష్ణ దర్శకత్వం వహితుండగా… పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఈ చిత్రం యువి క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. .

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-