రెడ్ జయింట్ మూవీస్ ద్వారా ఆర్య ‘అరణ్మనై-3’ విడుదల!

ఆర్య, ఆండ్రియా, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అరణ్మనై-3’. ఈ సినిమా మొదటి రెండు భాగాలు తెలుగులోనూ డబ్ అయ్యి విడుదలయ్యాయి. సుందర్ సి దర్శకత్వంలో ఆయన భార్య ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘అరణ్మనై-3’ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినా, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా దీని విడుదలను దర్శక నిర్మాతలు వాయిదా వేస్తూ వచ్చారు. ఆర్య ఇందులో ఘోస్ట్ గా నటించాడని తెలుస్తోంది. ఇందులో ఇటీవల కన్నుమూసిన వివేక్ తో పాటు, సాక్షి అగర్వాల్, యోగిబాబు, మనోబాల తదితరులు నటించారు. సత్య సంగీతం అందించగా, యుకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. విశేషం ఏమంటే… ఈ సినిమా వరల్డ్ రైట్స్ ను ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జయింట్ మూవీస్ సంస్థ చేజిక్కించుకుంది. ఇది తమ చిత్ర విజయంలో తొలి అడుగు అని నిర్మాత, నటి ఖుష్బూ సుందర్ చెబుతోంది.

తనతో తానే పోటీ పడబోతున్న ఆర్య!
ఇదిలా ఉంటే ఆర్య నటించిన ‘టెడ్డీ, సర్పట్ట’ చిత్రాలు ఈ యేడాది ఇప్పటికే ఓటీటీలో విడుదలయ్యాయి. ‘టెడ్డీ’ చిత్రంలో అతని భార్య సాయేషా సైగల్ నాయికగా నటించింది. కానీ ఈ సినిమా వ్యూవర్స్ ను మెప్పించడంలో విఫలమైంది. ఇక ‘సర్పట్ట’ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే… దసరా కానుకగా ఆర్య హీరోగా నటించిన ‘అరణ్మనై -3’ ఒక్కటే థియేటర్లలో విడుదలైతే బాగానే ఉండేది. కానీ విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా నటించిన ‘ఎనిమి’ సినిమాను సైతం అదే తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. సో…. అదే జరిగితే… ఆర్య నటించిన రెండు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడినట్టే అవుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!!

Related Articles

Latest Articles

-Advertisement-