‘అక్వామాన్’ సీక్వెల్… ‘ద లాస్ట్ కింగ్ డమ్’లో సూపర్ హీరో సాహసాలు!

డైరెక్టర్ జేమ్స్ వాన్ ఎట్టకేలకు తన ‘అక్వామాన్’ సీక్వెల్ టైటిల్ ని అఫీషియల్ గా బయటపెట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో లెటెస్ట్ అప్ డేట్ అందించిన జేమ్స్ నెక్ట్స్ ‘అక్వామాన్’ మూవీ పేరు ‘అక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్’ అని తెలిపాడు. ‘ద టైటిల్ ఈజ్ రైజింగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఆయన టైటిల్ తో కూడుకున్న ఒక ప్రొడక్షన్ మీటింగ్ ఫోటోను కూడా సొషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘అక్వామాన్’ సీక్వెల్ లో సూపర్ హీరో ఆర్థర్ కర్రీగా జేసన్ మొమొవా మరోమారు నటిస్తుండగా మెరా పాత్రలో యాంబర్ హర్డ్ కనిపించనుంది. ఫస్ట్ ‘అక్వామాన్’ మూవీ 2018 డిసెంబర్ లో విడుదలైంది. 1.13 బిలియన్ డాలర్ల వసూళ్లతో డీసీ కామిక్స్ వారికి కాసులు కురిపించింది. అందుకే, 2022 డిసెంబర్ లో రానున్న ‘అక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్’ పై భారీ అంచనాలున్నాయి. చూడాలి మరి, లెటెస్ట్ ‘అక్వామాన్’ బాక్సాఫీస్ వద్ద మునుగుతాడో… లేక తేలతాడో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-