పల్లెవెలుగు బస్సులకి కొత్త రూపు.. కార్గో ఆదాయంపై ఫోకస్‌

కరోనా సమయంలో ఆర్టీసీ బస్సులు మునుపడిలా తిరిగే పరిస్థితి లేదు.. చాలా బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి.. ఈ సమయంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది ఏపీఎస్ ఆర్టీసీ… దీంట్లో భాగంగా.. పల్లెవెలుగు బస్సులకి కొత్త రూపు ఇస్తున్నారు.. కార్గో ఆదాయంపై ఫోకస్‌ పెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ.. కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులను కార్గో క్యారియర్లుగా మార్చేస్తోంది… ఇప్పటికే 80 బస్సుల్లో 30 బస్సులను కార్గో క్వారియర్లుగా తయారు చేసింది ఆర్టీసీ.. నెల్లూరుకు 10 బస్సులను సిద్ధం చేసి పంపించారు ఆర్టీసీ అధికారులు.. దీంతో.. ప్రభుత్వానికి ఆదాయం కూడా ఆదా అవుతుంది ఎందుకంటే.. కొత్తగా కార్గో వెహికల్ కొనాలంటే రూ.20 లక్షలకు పైగానే వెచ్చించాల్సి ఉంటుంది.. కానీ, పల్లె వెలుగు బస్సులను కార్గో క్వారియర్లుగా మార్చేందుకు రూ.5.5 లక్షలు ఖర్చు అవుతోంది.. ఇది బాగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు.. ఇక, మార్పులు చేసిన వాటితో ఐదేళ్ల పాటు కార్గో సేవలు, ఆపై ఆదాయం వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-