బిగ్ క్లాష్ :”కేజీఎఫ్-2″తో పోటీకి సై అంటున్న స్టార్ హీరో

ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “కేజీఎఫ్-2”. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, సంజయ్ దత్ , శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ , అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, కార్తీక్ గౌడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కరోనా కారణంగా ఇప్పటికే సినిమా విడుదల చాలా ఆలస్యం అయ్యింది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. సోలోగా రావాలనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతేనేం “కేజీఎఫ్-2″కు పోటీగా వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయరని అంతా భావించారు. మరి ఆ సినిమా మొదటి భాగం “కేజీఎఫ్”కు వచ్చిన రెస్పాన్స్, “కేజీఎఫ్-2″కు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే అందరికీ షాకిస్తూ ఓ స్టార్ హీరో యష్ తో తలపడడానికి సిద్ధమవుతున్నాడు.

Read also : ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో ‘నాన్ వరువేన్’

మాగ్నమ్ ఓపస్ “కేజీఎఫ్-2″తో బాలీవుడ్ బిగ్ మూవీ క్లాష్ కాబోతోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” కూడా ఏప్రిల్ 14న విడుదలకు రెడీ అయ్యింది. “లాల్ సింగ్ చద్దా” చిత్రంలో కరీనా కపూర్ ఖాన్, సౌత్ నటుడు నాగ చైతన్య కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా ఈ చిత్రం ఫిబ్రవరి 2022 లో విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమా పనులు ఆ సమయానికి పూర్తయ్యే సూచనలు కన్పించకపోవడంతో ‘లాల్ సింగ్ చద్దా’ను ఏప్రిల్ 2022కి వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద “కేజీఎఫ్-2”, “లాల్ సింగ్ చద్దా” మధ్య బిగ్ క్లాష్ తప్పదన్నమాట. బాలీవుడ్ లో అమీర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాదిలోని థియేటర్లలో ఎక్కువగా అమీర్ ఆక్రమిస్తాడు. దీంతో “కేజీఎఫ్-2″కు అక్కడ థియేటర్ల సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే సౌత్ లో మాత్రం “కేజీఎఫ్-2” హవా నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు చిత్రాలూ పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని క్లాష్ సంక్రాంతికి జరగబోతోంది. ఇప్పుడు మరో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతుండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Image

Related Articles

Latest Articles