ఆ యాపిల్ కంప్యూట‌ర్ ఖ‌రీదు రూ.2.97 కోట్లు… ఎందుకంటే…

యాపిల్ మొబైల్ ఫోన్లు వాడాలని అంద‌రికీ ఉంటుంది. కానీ దాని ఖ‌రీదు అధికంగా ఉంటుంది కాబ‌ట్టి యాండ్రాయిడ్ వెర్ష‌న్ మొబైల్ ఫోన్లు వినియోగిస్తుంటారు.  యాపిల్ సంస్థ మొబైల్ ఫోన్ల రంగంలోకి వ‌చ్చే ముందు కంప్యూట‌ర్ల‌ను రూపొందించింది.  1976లో  స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్‌లు యాపిల్ సంస్థ‌ను ఏర్పాటు చేసి తొలిత‌రం కంప్యూట‌ర్లు రూపొందించారు.  తొలిత‌రంలో మొత్తం 200 కంప్యూట‌ర్ల‌ను త‌యారు చేశారు.  అందులో ఒక‌దానిని కాలిఫోర్నియాలోని రాంచో కుకుమోంగాలోని ఛ‌ఫే కాలేజీలో ప‌నిచేస్తున్న ఫ్రోఫెస‌ర్ కొనుగోలు చేశారు.  దీంతో యాపిల్ 1 కంప్యూట‌ర్ల‌కు ఛ‌ఫే కాలేజీ అని నామ‌క‌ర‌ణం చేశారు.  

Read: రాముల‌వారి కంట క‌న్నీరు… ఆందోళ‌న‌లో భ‌క్తులు…

అప్ప‌ట్టో ఈ తొలిత‌రం కంప్యూట‌ర్లు బాగా ఫేమ‌స్ అయ్యాయి  ఈ ఛ‌ఫే కాలేజీ కంప్యూట‌ర్‌ను ఇటీవ‌లే వేలం వేయ‌గా 4 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది.  అంటే మ‌న క‌రెన్సీలో సుమారుగా రూ.2.97 కోట్లు.  1976లో ఫ్రోఫెస‌ర్ కొనుగోలు చేసిన ఈ కంప్యూట‌ర్‌ను 1977 లో ఆయ‌న ద‌గ్గ‌ర చ‌దువుకున్న ఓ విద్యార్థి 650 డాల‌ర్లు వెచ్చించి కొనుగోలు చేశాడు.  అప్ప‌టి నుంచి ఆ కంప్యూట‌ర్ ఆయ‌న వ‌ద్ద‌నే ఉన్న‌ది.  అరుదైన తొలిత‌రం యాపిల్ కంప్యూట‌ర్ వేలంలో భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసింది యాపిల్ సంస్థ‌.  

Related Articles

Latest Articles