బ్రేకింగ్ : ఏపీ పదోతరగతి పరీక్షలు వాయిదా

ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు స్కూల్స్ తెరిచే ఆలోచన కూడా లేదని ప్రభుత్వం పేర్కొంది. అయితే పది పరీక్షలపై లిఖిత పూర్వకంగా తెలపాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. ఇది ఇలా ఉండగా.. పదో తరగతి పరీక్షలపై జులైలో మళ్లీ సమీక్షించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-