రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందు అభివృద్ధి చేద్దాం..

రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందైతే అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం… శ్రీకాకుళం జిల్లా అక్కివరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.. మేం శంకుస్థాపనలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని హితవుపలికిన తమ్మినేని సీతారం.. రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం…. ముందు అభివృద్ధి చేద్దాం.. ఎన్నికలొచ్చినప్పుడు ఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు ఎన్నుకుంటారన్నారు. ఇక, గడచిన టీడీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఏం చేశారో మీరే గమనించండి.. గ్రామాల అభివృద్ధికి మాకు అందరూ సహకరించండి అని కోరారు స్పీకర్ తమ్మినేని.

Related Articles

Latest Articles

-Advertisement-