ఏపీలో ఇసుక రీచుల పేరిట భారీ మోసం

ఏపీలో ఇసుక రీచుల పేరిట భారీ మోసం వెలుగు చూసింది. ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచుల్లో తవ్వకాలు సబ్ లీజులు ఇస్తామని 3.50 కోట్లు వసూలు చేసాడు ఓ కేటుగాడు. గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ IAS అధికారి గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి..ఆ కేటుగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఏపీలో ఇసుక రీచ్ ల వేలం జేపీ గ్రూప్ కి ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే నిందితుడు కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ గా గుర్తించారు పోలీసులు. 2018లో సైఫాబాద్ లోని ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ కేసులో రామకృష్ణ సతీష్ కుమార్ కీలక నిందితుడు. ఏపీ వ్యాప్తంగా ఏడుగురు బాధితుల నుంచి 3.50 కోట్లు వసూలు చేశాడు రామకృష్ణ సతీష్ కుమార్. ఈ కేసులో బెజవాడ భవానీ పురంలో ఇతనిపై FIR కూడా నమోదు అయింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు జేపీ గ్రూప్ మేనేజర్ హర్ష కుమార్. దీంతో 471, 420, 465, 469, 471, 120 బి సెక్షన్ల కింద రామకృష్ణ సతీష్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అలాగే నిందితుని బ్యాంక్ అకౌంట్ లోఉన్న రెండు కోట్లు సీజ్ చేశారు పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-