ఏపీ ప్రివిలేజ్ కమిటీ భేటీ.. కూన రవిపై సీరియస్‌

టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ సీరియస్‌ అయ్యింది.. ప్రివిలేజ్ కమిటీ ముందు కూన రవి హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావిస్తున్నామని చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిని ఆదేశించింది ప్రివిలేజ్‌ కమిటీ.. కానీ, వారు హాజరు కాలేదు.. ఇక, ప్రివిలేజ్‌ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 14వ తేదీన జరపాలని నిర్ణయించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి.. అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు మరోసారి అవకాశం ఇస్తున్నాం అన్నారు.. వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనని అచ్చెన్నాయుడు సమాచారం అందించారి.. వచ్చే నెల 14వ తేదీన హాజరు కావాల్సిందిగా అచ్చెన్నాయుడుకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. కానీ, కూన రవిని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తున్నాం అన్నారు.. కూన రవిది ధిక్కారంగా భావిస్తున్నామన్న కాకాని.. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలను పాటించకుండా కూన రవి తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడ్డారని.. కూన రవిపై చర్యలు తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీలో నిర్ణయం తీసుకోనాలని సభ ముందు ఉంచుతామన్నారు. తనకు ఇచ్చిన నోటీసుకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కావాలని ఎమ్మెల్యే రామనాయుడు కోరారు.. ఆయనకు సమాచారం అందిస్తామన్న కాకాని గోవర్ధన్‌రెడ్డి.. తన వ్యాఖ్యలు ఏ విధంగా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయో చెప్పాలని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారని… ఆ వివరాలు పంపుతాం అన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-