బురద రాజకీయాలు ఆపి.. వరద బాధితులను ఆదుకోవాలి : అచ్చెన్నా ఫైర్

అమరావతి : ఏపీ జగన్‌ పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్ వరదల పై శద్ర పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం సిగ్గుచేటు అని మండిపడ్డారు. జగనుకి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటంలో లేదని… జగన్.. ఇకనైనా బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన వారి ‎ కుటుంబాలకు
తక్షణమే ఆర్దిక సాయం అందించాలని పేర్కొన్నారు.

రాష్ర్టంలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వేలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు, ప్రాణ, ఆస్తి ‎ నష్టం జరిగిందని వెల్లడించారు. కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోయారని… ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు..? తెలిపారు. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‎వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటు రోడ్లపై ఉన్నారని.. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట నీట మునగటంతో అన్నదాతలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు.

Related Articles

Latest Articles