ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన నక్కలకాలనీ..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి,పాకాల మండలాల్లో వర్ష భీభత్సం సృష్టించింది. నక్కలేరు వాగు ప్రవాహంతో కొత్తనెన్నూరు గ్రామం ప్రమాదంలో చిక్కుకుంది. పంటపొలాలను ముంచెత్తుతూ ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామచంద్రాపురం నుంచి తిరుపతికి రాకపోకలు నిలిచిపోయాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుచానూరు సమీపంలోని నక్కలకాలనీ నీట మునిగింది. దీంతో షికారీలు జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో నాయుడుపేట-పూతలపట్లు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వారు నిరసన తెలుపుతున్నారు.

Related Articles

Latest Articles