ఏపీ పీసీసీలో కీల‌క మార్పులు ఉండ‌బోతున్నాయా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ గ‌త వైభ‌వాన్ని సంత‌రించుకునేందుకు పావులు క‌దుపుతున్న‌ది.  తెలంగాణ‌లో పీసీసీలో మార్పులు చేసిన త‌రువాత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే, ఏపీలో అందుకు విరుద్ధంగా ఉండ‌టంతో పార్టీలో తిరిగి నూత‌నోత్సాహం నింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఉమ్మ‌డి రాష్ట్రం రెండుగా విడిపోయిన త‌రువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కుదేలైంది.  గ‌త రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయింది.  కాంగ్రెస్ లోని కీల‌క నేతంతా ఇత‌ర పార్టీలోకి వ‌ల‌స వెళ్ల‌డంతో పార్టీ కుదేలైంది.  ఇప్పుడు పార్టీని తిరిగి బ‌లోపేతం చేయాల‌ని కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్న‌ది.  ఇందులో భాగంగానే త్వ‌ర‌లోనే ఏపీ పీసీసీ అధ్య‌క్షుడిని మారుస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉన్న‌దో త్వ‌ర‌లోనే తెలిపోతుంది.  

Read: మ‌ళ్లీ దేశంలో గ్యాస్ బాదుడు…

-Advertisement-ఏపీ పీసీసీలో కీల‌క మార్పులు ఉండ‌బోతున్నాయా?

Related Articles

Latest Articles