అచ్చెన్నపై మంత్రి వేణుగోపాల్ ఫైర్

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. బిసీలకు ఎన్టీఆర్ ఆరాధ్యదైవం అయితే..ఆయన్ను పదవీవీచ్చుతుణ్ని చేసిన సందర్భంలో, మరణించినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు బీసీల మనోభావాలను దెబ్బతీసాయన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల ద్రోహి. బీసీలంటే టీడీపీలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు మాత్రమే అన్నారు.

అధికారంలో ఉండగా బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు. మత్స్యకారులను..నాయి బ్రహ్మణులను తోలు వలుస్తా..తోకలు కత్తిరిస్తా అంటూ చాలా చులనగా చేసి మాట్లాడారు. బీసీలు మా వెనుకున్నారని చంద్రబాబు అనేవారు. నిజంగానే బీసీలను వెనుక పెట్టారు.ఇప్పుడు బీసీలపై అధ్యాయన కమిటీ వేస్తున్నానని అంటే..గతంలో బీసీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని స్పష్టమైందన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ.

కుప్పంలో కూలిపోయిన చంద్రబాబు బీసీల కోసం కొత్త కుయుక్తులతో నాటకాలు ప్రారంభించారన్నారు. బీసీలను రాజ్యాధికారం దిశగా తీసుకువెళ్తున్న ఘనత సిఎం జగన్ కే దక్కుతుందని, బీసీలలో పేదరికాన్ని సిఎం జగన్ చూశారన్నారు. 111 కార్పోరేషన్ పదవులు బిసిలకు ఇచ్చి గౌరవించింది జగన్ ఒక్కరే అన్నారు మంత్రి వేణుగోపాలకృష్ణ.

Related Articles

Latest Articles