పవన్ కల్యాణ్‌ ఒక బచ్చా.. మంత్రి వెల్లంపల్లి ఫైర్‌

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్‌.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో బీజేపీని పాచిపోయిన లడ్డు అన్నాడని, మాయావతి కాళ్లు కూడా పట్టుకున్నాడని గుర్తుచేసిన ఆయన.. ఇప్పుడు 2024లో నేనే ముఖ్యమంత్రి అంటాడు అంటూ మండిపడ్డారు.. ఇక, చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ ఒక బచ్చాగాడు అంటూ హాట్ కామెంట్లు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్.. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం పవన్ అంటూ ఫైర్ అయ్యారు.

-Advertisement-పవన్ కల్యాణ్‌ ఒక బచ్చా.. మంత్రి వెల్లంపల్లి ఫైర్‌

Related Articles

Latest Articles