గత ప్రభుత్వం నాణ్యత లోపంతోనే నేడు రోడ్లకు ఈ పరిస్థితి…

రామచంద్రాపురం పట్టణంలోని చాకలిపేట హైస్కూల్ ను సందర్శించి పిల్లలతో కలిసి తిన్నారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. అనంతరం ఆయన మాట్లాడుతూ… నాడు-నేడు పనులు, విద్యా కానుక కిట్లు పంపిణీని పరిశీలించాను. జగనన్న గోరుముద్ద ద్వారా అందిస్తున్న భోజన సదుపాయాలను అకస్మిక తనీఖీ చేసాను. చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు.. నేను స్వయంగా తిని చూసాను. జగనన్న గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజనం ‌మా ఇంటి భోజనం కన్న గొప్పగా ఉందని విద్యార్థులు చెప్పుతుంటే చాలా సంతోషం కలిగించింది. బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మ గాంధీ ఆశయం ఒక్కటే విద్యతో పేదరిక నిర్మూలన. ఆ ఆశయ సాధన దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు నిదర్శనం అని తెలిపారు.

అయితే ఎదో ఒక్క సమస్య సృష్టించి ఆ సమస్యతో ప్రజలు మభ్యపెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. మీకు అధికారం పోయిందని ఆ అధికారం కోసం సంక్షేమ పాలకుడు పాలనను ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం నాణ్యత లోపంతోనే నేడు రోడ్లకు ఈ పరిస్థితి వచ్చింది అని పేర్కొన్నారు మంత్రి.

Related Articles

Latest Articles

-Advertisement-