టీడీపీ వల్లే రోడ్లకు ఈ దుస్థితి.. ఏపీ మంత్రి ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రోడ్ల దుస్థితికి గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఆరోపించారు మంత్రి శంకర నారాయణ… సీఎం వైఎస్‌ జగన్‌.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని.. వర్షాకాలం పూర్తి అయిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేపడతామని ప్రకటించారు.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ రోడ్లను పూర్తిగా గాలికి వదిలేసిందని ఆరోపించిన శంకర నారాయణ.. అక్టోబర్‌ తర్వాత రోడ్ల పనులు ప్రారంభిస్తామని తెలిపారు.. ఆరు వేల కోట్లతో ఎన్‌డీబీ ద్వారా రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం.. రెండు వేల కోట్లకు టెండర్లు పిలిచామన్న ఆయన.. టీడీపీ వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాగా, వర్షాల కారణంగా రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.. ఓవైపు రోడ్లపై గుంతలో.. ఆపై వర్షపు నీరు.. ఎక్కడ వెళ్తే ఏ ప్రమాదం పొంచిఉందో తెలియని పరిస్థితి ఉండడంతో.. రోడ్లు బాగుచేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు సీఎం వైఎస్‌ జగన్‌.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-