అక్రమాలకు పాల్పడిన వారిపై ఫైన్లు : మంత్రి పెద్దిరెడ్డి

సీఎం జగన్ రోడ్ల అభివృద్ధి పై సమీక్ష చేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గత టీడీపీ హయాంలో పీఎంజిఎస్ వై ద్వారా 330 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మేము 3,185 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశాము. ఏఐబీ ద్వారా 5,238 కిలోమీటర్లు టెండర్లు పిలిస్తే.. 1816 కిలోమీటర్లు రోడ్లు పూర్తి చేసాము. టీడీపీ హయాంలో పంచాయతీ రాజ్ శాఖ తరపున 1,130 కిలోమీటర్లు రోడ్లు వేశారు. అక్టోబర్ నాటికి టెండర్లు పిలిచి వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మా హయాంలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి..కనుక రోడ్లు దెబ్బతిన్నాయి. మేము చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడరు..ఒకటి రెండు చోట్ల రోడ్లు దెబ్బతింటే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు అన్నారు. ఆ చంద్రబాబు తానా అంటే తోక పార్టీ జనసేన తందానా అంటుంది. పంచాయతీ రాజ్ ద్వారా ఏ ప్రభుత్వం ఇన్ని వేలకోట్లు ఖర్చు చేసి రోడ్లు వేయలేదు. మైనింగ్, లిక్కర్ అని ఏదో అభూత కల్పనలు మాట్లాడుతున్నాడు. మైనింగ్ లో అక్రమాలు జరగకుండా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేశాం. అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపై ఫైన్లు వేస్తున్నాం అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-