శాశ్వతంగా అదానీ చేతికి గంగవరం పోర్టు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి మేకపాటి

గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాలను తమకు అప్పగించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది అదానీ గ్రూప్.. దీనిపై అధ్యయనానికి ఉన్నతస్థాయిలో అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. దీంతో.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ గ్రూప్‌కు వెళ్లిపోతుందనే ప్రచారం ఊపందుకుంది.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి.. గంగవరం పోర్టు శాశ్వతంగా అదానీ సంస్థకు వెళ్లి పోతుందన్నది అవాస్తవం అన్నారు.. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి 50 ఏళ్ల వరకు ప్రైవేటు భాగస్వామ్య సంస్థకు హక్కులు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. ఒప్పంద కాలం పూర్తి అయిన తర్వాత అంటే 36 ఏళ్ల తర్వాత గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని క్లారిటీ ఇచ్చారు.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రచారం కోసం పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించిన మంత్రి గౌతమ్‌రెడ్డి… వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు 10 శాతమే అన్నారు.. కానీ, మేం వాస్తవంగా వచ్చే పెట్టుబడుల లెక్కలనే చెబుతున్నాం… టీడీపీలా మభ్యపెట్టే ప్రయత్నం చేయటం లేదన్నారు.

మరోవైపు మొత్తం ఎస్జీడీపీలో 35శాతం వ్యవసాయం, 23 శాతం పారిశ్రామిక రంగానిదని.. దేశం మొత్తం ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం పెంచాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి… మూడు పారిశ్రామిక కారిడార్‌లు రాష్ట్రంలోని 13 జిల్లాల గుండా వెళ్తున్నాయని విరించిన ఆయన.. అనంతపురం‌, చిత్తూరు, విశాఖపట్నంలో మూడు కాన్సెప్ట్ సిటీలు వస్తున్నాయన్నారు.. ఏపీలో 2019లో 34, 696 కోట్లు, 2020లో 9,840 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇదే కాలానికి తెలంగాణలో సగటున ఈ రెండేళ్లలో 6, 7 వేల కోట్ల పెట్టుబడులే వచ్చినట్టు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి అన్న ముఖ్యమంత్రి ఆలోచన దిశగా ప్రభుత్వ ఆచరణలో పెడుతుందని తెలిపారు.. మా ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మూడవ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి జరుగుతోందని.. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఘనత కూడా మా ప్రభుత్వానిదే అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-