కొడాలి నాని కీల‌క వ్యాఖ్య‌లు: ప‌వ‌న్ జీవితంలో వైసీపీని ఓడించ‌లేడు…

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.  నిన్న‌టి రోజున ప‌వ‌న్ అధికార‌పార్టీపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తున్నారు.  తాజాగా మంత్రి కొడాలి నాని కౌంట‌ర్ ఇచ్చారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీవితంలో వైసీపీని ఓడించ‌లేరని,  ముందు ప‌వ‌న్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో చూసుకోవాల‌ని అన్నారు.  అన్ని పార్టీల‌తో క‌లిసి రా చూసుకుందామ‌ని అన్నారు.  వైసీపీ నేత‌ల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌య‌పెట్టేదేంట‌ని ప్ర‌శ్నించారు.  ఇంకో జానీ సినిమా చూపించి భ‌య‌పెడ‌తారా అని ప్ర‌శ్నించారు.  ప‌వ‌న్‌ను చూసి ఆయ‌న అభిమానులు భ‌య‌ప‌డ‌తారేమోగాని తాము కాద‌ని అన్నారు.  చంద్ర‌బాబు స్క్రిప్టులు చ‌దివి త‌మ‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తే ఎవ‌రూ భ‌య‌ప‌డ‌ర‌ని కొడాలి నాని పేర్కొన్నారు.  మ‌రి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.  

Read: త‌మిళ‌నాడులో సంచ‌ల‌నం: అర్ధ‌రాత్రి సీఎం ఆక‌స్మిక త‌నీఖీలు…

-Advertisement-కొడాలి నాని కీల‌క వ్యాఖ్య‌లు:  ప‌వ‌న్ జీవితంలో వైసీపీని ఓడించ‌లేడు...

Related Articles

Latest Articles