విద్య.. వైద్యంపై సీఎంకి ప్రత్యేక శ్రద్ధ వుంది : మంత్రి కన్నబాబు

విద్య..వైద్యం పై ముఖ్య మంత్రి జగన్ కు ప్రత్యేక శ్రద్ధ వుంది అని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు ఫీవర్ సర్వే ఉదృతి కొనసాగాలి. సచివాలయం.. వాలంటీర్ లను అప్రమత్తం చెయ్యండి అని సూచించారు. ఒక ఇంట్లో జ్వరం వస్తె సచివాలయం ఉద్యోగికి తెలిసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. విశాఖ అన్ని రకాలుగా కేంద్రం కావడంతో రోగుల ఒత్తిడి వుంటుంది. ఆ పరిస్థితికి తగ్గట్టు కేజీహెచ్ లో వైద్య సదుపాయం వుండాలి. నిర్లక్ష్యంగా లేకుండా వుంటే వ్యాధుల పై విజయం సాధించవచ్చు అని అన్నారు. ఇక డెంగ్యూ నీ ఆరోగ్య శ్రీ లోకి తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దే అని చెప్పిన ఆయన నవంబర్ నుంచి పాడేరు లోనే శస్త్ర చికిత్సలు జరగనున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-