నెల్లూరు జీజీహెచ్‌లో మెడికోపై అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న‌.. స‌ర్కార్ సీరియ‌స్‌..

నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్న‌త‌స్థానంలో ఉన్న ఓ వైద్యుడు.. త‌న కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని వేధిస్తున్నట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాల‌ని.. బెదిరింపుల‌కు దిగుతార‌ట‌.. ఓ హౌజ్ సర్జన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైర‌ల్‌గా మార‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగు చూసింది.. నా రూమ్ లో ఏసీ ఉంది వచ్చేయ్ అని అంటావా..? రాకపోతే కాళ్లూ చేతులూ కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తీసుకుపోతానంటావా..? అడిగితే ఇవన్నీ కామన్ అంటావా..? నీ కూతుర్ని ఇలా ఎవరైనా చేస్తే ఏంచేస్తావు.. ? అంటూ ఏకిపారేసింది.. నెల్లూరు ప్రభుత్వ పెద్దాసుపత్రిలో హౌస్ సర్జన్ గా ఉంటున్న ఓ విద్యార్థిని.. అయితే, ఈ వ్య‌వ‌హారిన్న ఏపీ స‌ర్కార్ సీరియ‌స్‌గా తీసుకుంది..సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు ఏపీ వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల‌నాని.. నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సాంబశివరావు, ఇద్దరు ప్రొఫెసర్స్ తో విచారణకు ఆదేశించారు మంత్రి… ఈరోజు సాయంత్రానికి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని డీఎంఈ డాక్ట‌ర్ రాఘవేంద్ర రావును ఆదేశించారు . ఇక‌, ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి ఆళ్ల నాని.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-