టెన్త్, ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం.. త్వ‌ర‌లోనే షెడ్యూల్..

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలంతో కొన్ని ప‌రీక్ష‌లు ర‌ద్దు కాగా.. మ‌రికొన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. కానీ, టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో ఒక్క‌టే మాట‌కు క‌ట్టుబ‌డి ఉంది.. ప‌రీక్ష‌లు ఇప్పుడు వాయిదా ప‌డొచ్చు.. కానీ, ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత మ‌ళ్లీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించితీరుతాం అంటున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్… ప్ర‌కాశం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. ఎన్టీవీతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.. త్వ‌ర‌లోనే టెన్త్, ఇంటర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా ప్ర‌క‌టిస్తాం అన్నారు.. కరోనా ఉధృతి తగ్గిన తరువాత పరిస్థితి సమీక్షించి పరీక్షలు నిర్వ‌హిస్తామ‌న్న మంత్రి సురేష్.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. పరీక్షలు రద్దయ్యాయని అడ్మిషన్లు చేసే ఇంటర్మీడియట్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.. ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా పని చేసే కాలేజీలపై చర్యలు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆదిమూల‌పు సురేష్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-