ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం తెలంగాణకి మంచిదికాదు..!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో కొనసాగుతూనే ఉంది.. కేంద్రం గెజిట్లు విడుదల చేసినా.. మంత్రులు, నేతల మధ్య హాట్‌ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జల జగడం విషయంలో స్పందిస్తూ.. ఎన్నికల కోసమో, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కోసమో.. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం తెలంగాణకి మంచి పద్దతికాదని హితవుపలికారు.. ఏపీకి రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క తగ్గినా ఒప్పుకోమని స్పష్టం చేసిన ఆయన.. రాయలసీమ ప్రజలకు నీళ్లు ఇవ్వాలా.. వద్దా..? అనేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూటిగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లాపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఫైర్‌ అయిన మంత్రి ఆదిమూలపు సురేష్.. అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు ప్రకాశం జిల్లాకి వచ్చిన చంద్రబాబు.. వెలుగొండ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-