మాన్సాస్ ట్ర‌స్ట్‌పై ఏపీ హైకోర్టు కీల‌క ఆదేశం…

విజ‌య‌న‌గ‌రంలోని మాన్సాస్ ట్ర‌స్ట్ వ్య‌వ‌హారంపై అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్టులో రిట్ పిటీష‌న్‌ను దాఖ‌లు చేశారు.  ఈ రిట్ పీటీష‌న్‌ను విచారించిన హైకోర్ట్ కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది.  ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది.  మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం, మాన్సాస్ ట్ర‌స్ట్‌కు అశోక్ గ‌జ‌ప‌తి రాజునే చైర్మ‌న్ గా ఉండేలా ఆదేశాలు జారీచేసింది.  గ‌తంలో మాన్సాస్‌, మ‌హాల‌క్ష్మీ దేవ‌స్థానం ట్ర‌స్ట్‌ల‌కు అశోక్ గ‌జ‌ప‌తిరాజు చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించేవారు.  అయితే, ఆయ‌న్ను త‌ప్పిస్తూ ప్ర‌భుత్వం జీవో 72 ను తీసుకొచ్చింది.  ఆయ‌న స్థానంలో సంచ‌యిత‌ను ప్ర‌భుత్వం ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా నియ‌మించింది.  దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు హైకోర్ట్ లో రిట్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.  అంతేకాకుండా సంచ‌యిత వేసిన పిటీష‌న్‌ను కూడా హైకోర్ట్ తోసిపుచ్చింది.  సింహాచ‌లం ట్ర‌స్ట్‌కు కూడా అశోక్ గ‌జ‌ప‌తి రాజును కొన‌సాగించాల‌ని హైకోర్టు ఆదేశించింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-