ఆనందయ్య మందుపై హై కోర్టు కీలక ఆదేశాలు

ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్ గా మందు తయారు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆనందయ్య తన మందును ప్రభుత్వం గుర్తించాలని పిటిషన్ వేశారని వాదనలు వినిపించారు ఆనందయ్య తరపు న్యాయవాది. ఆనందయ్య మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో కోర్టుకు తెలియ జేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని.. లిఖిత పూర్వకంగా ఇది ఇంకా స్పష్టం కాలేదని కూడా హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-