అమూల్ ఒప్పందం.. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జ‌ర‌పిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని కోరారు.. దీనిపై ఇవాళ విచార‌ణ జరిపిన హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.. మ‌రోవైపు.. గోదావరి జిల్లాల్లో అమూల్‌ పాలసేకరణను ఈరోజే ప్రారంభించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.. పాడి రైతులకు పెద్ద ఎత్తున లాభం ఇస్తారని.. అమూల్ పైసా కూడా లాభం తీసుకోకుండా.. రైతుల కోసం పని చేస్తుందని వెల్ల‌డించారు. మ‌రోవైపు.. ఏపీడెయిరీకి చెందిన వేల కోట్ల ఆస్తులను అప్ప‌నంగా అమూల్‌కు అప్ప‌గిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-