వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ…

వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ బట్టుదేవానంద్‌ బెంచ్‌ ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం… వైఎస్ఆర్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం, ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి. అందువల్ల ఈవ్యవహారంలో కోర్టులకుండే పాత్ర పరిమితం పథకానికి అర్హులు ఎవరు? అమలు ఎలా? అనే అంశాల్లో కోర్టుల పాత్ర పరిమితం. పెద్ద సంఖ్యలో మహిళలు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా వరుసగా నాలుగు సంవత్సరాలు వారి చేతికే డబ్బు అందుతోంది. లబ్ధిదారులకు వయోపరిమితి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విధాన నిర్ణయం. 60 ఏళ్లకు మించిన వారికి వైఎస్ఆర్ చేయూత వర్తించదు. 60 ఏళ్లు దాటితే నియమాలను అనుసరించి వారికి పెన్షన్‌ అర్హత వస్తుంది. ఈ పథకంపై వస్తున్న అభ్యర్థనలు, మరియు పథకం అమలును ఒకటిగా కలిపి చూడలేం అని అన్నారు.

ఈ చేయూత పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వం జోక్యంచేసుకుంటోంది. కోర్టు వ్యక్తంచేసిన అభిప్రాయాలనుకూడా అంగీకరిస్తున్నాం. పథకం అమలులో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా పథకాలను అందించాలన్నది విధానం. అంతేకాక అర్హులైన ఏ ఒక్కరికీ కూడా పథకాన్ని నిరాకరించకూడదని స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో తరతమ భేదం చూపరాదని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ చేయలేని విధంగా ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కొన్ని మీడియా కథనాలను కోర్టు పరిగణలోకి తీసుకోవద్దని కోరుతున్నాను. నిరాధారమైన, ధృవీకరించని తప్పుదోవ పట్టించే కథనాలు ఇవి అన్నారు. అర్హత ఉన్నవారు మిగిలిపోతే కనుక కచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోని వారికి ప్రయోజనాలు అందిస్తుంది. చేయూత అమలు విధానంలో ఏమైనా సంక్లిష్టతలు ఉంటే తీసుకోవాల్సిన చర్యలను అధికారులు తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్దేశాలను అమలు చేయడానికి, మానవీయ కోణంలో స్పందించేలా తగిన సూచనలు చేస్తాను. లబ్ధిదారులందరికీ కూడా ప్రయోజనాలను అందించాం. కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని ఏజీ కోర్టును కోరారు.

Related Articles

Latest Articles

-Advertisement-