అమూల్‌కి ఏపీ డెయిరీ ఆస్తులు..! కౌంట‌ర్ దాఖ‌లుకు స‌మ‌యం కోరిన స‌ర్కార్

ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు ఇస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు.. హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే కాగా… ఇవాళ విచార‌ణ సంద‌ర్భంగా.. కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి స‌మ‌యం కావాల‌ని కోరింది ఏపీ ప్ర‌భుత్వం.. దీంతో.. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది హైకోర్టు.. ఇక‌, పాడి రైతుల తరుపున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తామ‌ని హైకోర్టు దృష్టికి న్యాయ‌వాదులు తీసుకెళ్ల‌గా.. ఆ అభ్యర్థనను హైకోర్టు తిర‌స్క‌రించింది. కాగా, ఏపీ డెయిరీ ఆస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం.. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌ నిరర్థక ఆస్తులను అమూల్ సంస్థకు నామమాత్రపు లీజు ప్రాతిపదికన అప్పగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-