అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ పిటిష‌న్ల‌పై ఏపీ హైకోర్టులో విచార‌ణ వాయిదా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానుల అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ,  సీఆర్డీఏ ర‌ద్దు, ఉప‌సంహ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై విచార‌ణ‌ను ఏపీ హైకోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.  3 రాజ‌ధానులు, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు వివ‌రాల‌ను సమ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది.  ఉపసంహ‌ర‌ణ బిల్లుపై మెమో దాఖ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ స‌మ‌యం కోరారు.  

Read: సీఎం జ‌గ‌న్ ఒక్కసారి నిర్ణ‌యం తీసుకుంటే వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేదు : కొడాలి నాని

శుక్ర‌వారం అఫిడ‌విట్‌తో పాటుగా మెమో దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.  ఇక ఇదిలా ఉంటే, సీఆర్డీఏ ర‌ద్దు ఉప‌సంహ‌ర‌ణ బిల్లును ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గ‌న ప్ర‌వేశ‌పెట్టారు.  అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ సూచించింద‌ని, అమ‌రావ‌తి ప్రాంతం సార‌వంత‌మైన భూమి అని, ఖ‌రీదైన న‌గరం అని, దాన్ని వృధాచేయ‌వ‌ద్ద‌ని క‌మిటీ స్ప‌ష్టం చేసింద‌ని మంత్రి బుగ్గ‌న అసెంబ్లీలో పేర్కొన్నారు.  

Related Articles

Latest Articles