ఏపీ కీల‌క నిర్ణ‌యంః పిల్ల‌ల త‌ల్లుల‌కు టీకా…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీకా కార్య‌క్ర‌మం కొన‌సాగుతున్న‌ది.  ప్ర‌స్తుతం 45 ఏళ్లు దాటిన వారికి చురుగ్గా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  టీకాలు త‌క్కువుగా ఉండ‌టంతో 18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ మంద‌కోడిగా సాగుతున్న‌ది.  అయితే, ఈనెల 21 నుంచి దేశంలో 18ఏళ్లు నిండిన అంద‌రికి ఉచితంగా వ్యాక్సిన్‌ను అందించ‌బోతున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.  ఇక‌పోతే,  సెకండ్ వేవ్ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  థ‌ర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంద‌ని, థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండి ఆసుప‌త్రుల్లో చేరాల్సి వ‌చ్చే ఐదేళ్ల‌లోపు చిన్నారుల‌కు, వారి త‌ల్లుల‌కు టీకా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  దీనికి సంబందించి ప్ర‌త్యేక క‌మిటి ఇచ్చిన సిఫార్సుల‌ను ప్ర‌భుత్వం ఆమోదం తెలిపిన‌ట్లు వైద్యారోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.  చిన్నారుల తల్లుల‌కు 45 ఏళ్ల ప‌రిమితిపై మిన‌హాయింపులు ఇచ్చిన‌ట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-