మెరుగుపడుతున్న ఏపీ గవర్నర్ ఆరోగ్యం

కోవిడ్ బారిన పడ్డ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. AIG ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. కోవిడ్ తో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు గవర్నర్. ఆయనకు సంబంధించి వైద్యులు అన్నీ చూసుకుంటున్నారు. సాధారణ స్థితిలో ఆక్సిజన్ స్థాయిలు వున్నాయని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ లోని వైద్య బృందం పర్యవేక్షణలో గవర్నర్‌కి వైద్య చికిత్స అందిస్తున్నారు.

88 ఏళ్ల వయసున్న గవర్నర్‌ బిబి హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటి గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారు. గవర్నర్‌కు నవంబర్ 15వ తేదీన కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నామని, ఆయన కోలుకుంటున్నారని AIG ఆస్పత్రి వైద్యులు తెలిపారు. గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ తరవాత ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ ఏపీ గవర్నర్‌ అయ్యారు. 2019 జూలై నుంచి ఏపీ గవర్నర్‌గా విధుల్లో వున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు. సుదీర్ఘమయిన రాజకీయ అనుభవం ఆయన స్వంతం. రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ ఆయన గుర్తింపు పొందారు.

Related Articles

Latest Articles