ఆమోద‌ముద్ర‌.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో కొత్త‌గా ఎంపిక కానున్న ఆ న‌లుగురు ఎమ్మెల్సీలు ఎవ‌రు? అనే ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఆ న‌లుగురు ఎమ్మెల్సీల‌కు ఆమోద‌ముద్ర వేశారు గ‌వ‌ర్న‌ర్ విశ్వభూషణ్ హరిచందన్‌.. సాయంత్రం త‌న శ్రీ‌మ‌తి వైఎస్ భార‌తితో క‌లిసి రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో స‌మావేశం జ‌రిగింది.. ఈ సంద‌ర్భంగా గవర్నర్ కోటాలో లేళ్ళ అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మోషేన్ రాజు, తోట త్రిమూర్తులు పేర్ల‌ను సీఎం ప్ర‌తిపాదించ‌గా.. గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేశారు.. అయితే, తోట త్రిమూర్తులు, అప్పిరెడ్డి, రమేష్ యాదవ్ కు నేర చరిత్ర ఉందంటూ.. గ‌వ‌ర్న‌ర్‌కు టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య లేఖ రాయ‌డం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఈ నేప‌థ్యంలో.. గ‌వ‌ర్న‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు అనే చ‌ర్చ కూడా మొద‌లైంది.. కానీ, సీఎం భేటీ.. గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర వేయ‌డంతో.. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ ప‌డింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-