టికెట్ ధరల అంశంపై సమయం కోరిన సర్కార్

ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. సినిమా టికెట్ ధరల అంశంపై సమగ్రంగా పరిశీలన జరపాలంటూ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి సినీ పరిశ్రమ కమిటీ భేటీ త్వరలో జరగునుందని ప్రభుత్వం కోర్టుకి తెలిపింది. అంతేకాదు ఈ సమావేశం ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని కోర్టును కోరింది ప్రభుత్వం. దీంతో సినిమా టికెట్ రేట్ల విచారణను ఫిబ్రవరి10కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక అఫిడవిట్‌ దాఖలుకు అడ్వకేట్‌ జనరల్‌ సమయం కోరినట్టు సమాచారం.

Read Also : రౌడీ బాయ్స్ ‘బృందావనం’లో అనుపమ… మార్మోగుతున్న డిఎస్పీ మాస్ బీట్

ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 27న ఓ కమిటీని నిర్ణయిస్తూ జీవో జారీ చేసింది. ఈ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరిస్తోంది. న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పురపాలక శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, సమాచార, పౌర సంబంధాల కమీషనర్, ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం, డిస్ట్రిబ్యూటర్ తుమ్మల సీతారాంప్రసాద్‌, సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్, సిబిఎఫ్సి (సెన్సార్ బోర్డ్) సభ్యుడు వడ్డి ఓంప్రకాశ్‌ నారాయణ, తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు ముత్యాల రాందాస్‌, డాక్టర్ జూపల్లి రాకేశ్‌ రెడ్డి, శ్రీమతి గంప లక్ష్మీ సభ్యులుగా నియమితులయ్యారు.

Related Articles

Latest Articles