సినిమా థియేటర్ల ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లోకి ఏపీ ప్రభుత్వం!

ఏపీలోని జగన్ సర్కార్… మరోసారి సినిమా రంగంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సింగిల్ విండో పధకం ద్వారా టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ మధ్య కరోనా సమయంలో టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ పైనా ఫోకస్ పెట్టింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను నొప్పి తెలియకుండా వసూల్ చేసేస్తున్నారు. టిక్కెట్ కు పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకూ అదనంగా సర్వీస్ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు.

Read Also : హరీష్ శంకర్ మూవీకి పవన్ షాకింగ్ రెమ్యూనరేషన్?

అలాంటి వాటికి చెక్ చెబుతూ, ఆన్ లైన్ బుకింగ్ విషయంలో యూనిఫామిటీ తీసుకు రావడం కోసం ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఆన్ లైన్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు… జీవోనూ జారీ చేసింది. నిజానికి ఇలాంటి వ్యవ్యస్థను తెలంగాణాలో తీసుకు రావాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ మాదిరిగా కాకుండా అక్కడైనా ప్రభుత్వం సత్వరం ఆ పని చేస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే…. థియేటర్ల ఆక్యుపెన్సీ ని యాభై శాతం నుండి నూరు శాతానికి పెంచాల్సిందిగా ఎగ్జిబిటర్స్ కొంతకాలంగా కోరుతున్నారు. మరి దానిపై ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో!

Image

Related Articles

Latest Articles

-Advertisement-