ఏపీలో ఈనెల 31వరకు నైట్ కర్ఫ్యూ… జీవో విడుదల

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో నైట్ కర్ఫ్యూ విధించాలని సోమవారం సీఎం జగన్ ఆదేశించగా… అందుకు సంబంధించిన జీవోను మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదలైన జీవో ప్రకారం ఏపీలో ఈనెల 31 వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉ.5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అలాగే కరోనా ఆంక్షలు కూడా రాష్ట్రంలో అమలులో ఉంటాయని తెలిపింది.

Read Also: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. రెండవ ఘాట్ రోడ్ ఓపెన్

వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశాల్లో అయితే 200 మంది, ఇన్‌డోర్‌‌లలో అయితే 100 మంది కంటే ఎక్కువగా హాజరుకాకూడదని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం కెపాసిటీతోనే థియేటర్లను నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకులకు మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే నిత్యావసర వస్తువులు, అత్యవసర చికిత్స వంటి సేవలకు కరోనా ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

Latest Articles