ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. మహిళా పోలీస్ విభాగం ఏర్పాటు

ఏపీలో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా పోలీస్ విభాగంలో మొత్తం ఐదు కేటగిరీలుగా పోస్టులు ఉండనున్నాయి.

మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ, సీనియర్ మహిళా పోలీసు, మహిళా పోలీసుగా ఉద్యోగ కేటగిరీలు ఉంటాయని నోటిఫికేషన్‌లో ఏపీ హోంశాఖ పేర్కొంది. మహిళా పోలీసు విభాగంలో 90 శాతం మేర డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మహిళా హోంగార్డులను 5 శాతం మేర, గ్రామ వార్డు మహిళా వాలంటీర్ల నుంచి 5 శాతం మందిని మహిళా పోలీసు విభాగంలో భర్తీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా రీ-డిజిగ్నేట్ చేస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Related Articles

Latest Articles