ఏపీ వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తనిఖీలు….

విశాఖలో మద్యం అమ్మకాల సొమ్ము అవకతవకల ఘటనతో ఎక్సైజ్‌ శాఖ అలెర్ట్‌ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో తనిఖీలు.. స్పెషల్‌ డ్రైవ్‌కు డెప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆదేశించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా మద్యం అమ్మకాల సొమ్ము డిపాజిట్‌.. రికార్డులను పరిశీలించనున్నారు ఎక్సైజ్‌ ఉద్యోగులు. తమ పరిధిలోని దుకాణాలను కాకుండా.. జంబ్లింగ్‌ పద్దతిలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖ సీఐలకు తెలిపింది. మొత్తం 2894 దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. విశాఖ సహా ఇంకొన్ని చోట్ల కూడా ఇదే తరహాలో అవకతవకలు జరిగాయనే విషయమై తన దృష్టికి రావడంతో స్పెషల్‌ డ్రైవ్‌కు ఆదేశించారు డెప్యూటీ సీఎం. అయితే ఇప్పటికే విశాఖలో 14 మద్యం దుకాణాల్లో రూ. 34 లక్షల మేర అవకతవకలు జరిగాయని గుర్తించి ఓ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసింది ప్రభుత్వం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-