ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్రాంతి సెలవుల్లో మార్పులు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం మార్చింది. ఇదివరకు ప్రకటించిన సెలవులకు బదులుగా ఈనెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి 13, 14, 15 తేదీల్లోనే భోగి, సంక్రాంతి, కనుమ పండగలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు ప్రకటించింది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా నైట్ కర్ఫ్యూ అమలు తేదీని కూడా ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 18 నుంచి ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనుంది. ఈనెల 31 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అధికారులు అమలు చేయనున్నారు.

Related Articles

Latest Articles