కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ మంత్రి బుగ్గన

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో బుగ్గనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పాల్గొనగా… రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించాం అన్నారు.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆమోదం ప్రోగ్రెస్ లో ఉందన్న ఆయన.. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్నారు.. రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయింది.. అందుకే రాష్ట్రం అప్పులు చేయాల్సి వస్తుందని.. ప్రపంచమంతటా అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందన్నారు.

“లాక్ డౌన్” కారణంగా పేద ప్రజలు ఉపాధి కోల్పోయారన్నారు ఆర్థికమంత్రి బుగ్గన.. వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. “కరోనా” చికిత్సకు అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం “ఆరోగ్య శ్రీ” కింద పూర్తిగా భరిస్తుందని గుర్తుచేశారు.. “ముకర్ మ్యోకాసిస్” ఒక్కొక్కరికి 7, 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని.. ఈ పనులన్నీ రాష్ట్ర ప్రజలకు చేయొద్దని ప్రతిపక్షం కోరుకుంటుందా? అని ప్రశ్నించారు.. పేద ప్రజలను ఆదుకోవద్దని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయా..!? అంటూ ప్రతిపక్షాల విమర్శలపై ఫైర్ అయ్యారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.

-Advertisement-కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఏపీ మంత్రి బుగ్గన

Related Articles

Latest Articles