ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నాం..

ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్.. జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగ‌స్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయుల‌కు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాల‌ని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండ‌వ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆయన… నోటుబుక్కులు, టెస్టుబుక్ లు, బెల్టులు 100 శాతం, స్కూలు బ్యాగులు 80 శాతం, యూనిఫాంలు 80 శాతం, డిక్షనరీలు 20 శాతం అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.

నాడునేడులో భాగంగా జ‌రుగుతున్న ప‌నులు 90 నుండి 98 శాతం పూర్తయ్యాయని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. 16న వీటిని రాష్ట్ర ప్రజ‌ల‌కు అంకితం చేస్తున్నామన్న ఆయన.. అదే రోజు నాడునేడు ఫేజ్ 2 నాలుగు వేల కోట్లతో 16000 స్కూళ్ళ రూపురేఖ‌లు మార్చేలా కార్యక్రమం ప్రారంభిస్తామని వెల్లడించారు.. విద్యార్ధుల‌కు లైన్ ఎస్సెస్‌మెంట్ కింద ఉపాధ్యయుల‌ను ఇంటికి పంపి ప్రిపేర్‌ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పామన్న మంత్రి.. అమ్మఒడి వ‌ద్దన్న 9 ల‌క్షల మందికి వ‌చ్చే విద్యా సంవ‌త్సరం నుండి ల్యాప్ ట్యాప్ లు ఇస్తున్నామన్నారు. ఇక, డిగ్రీ కాలేజీలో వ‌స‌తి దీవెన వ‌ద్దనుకుంటున్న వారికి కూడా ల్యాప్ టాప్ లు వ‌చ్చే ఏడాది అందిస్తాం.. ఆగస్టు 16 నుంచి కోవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటిస్తూ స్కూళ్లను ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-