ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. అబ్బాయిలదే పైచేయి

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.. ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. టెస్ట్‌కు 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారని.. వారిలో 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు మంత్రి.. ఇక, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల 26 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్న ఆయన.. రేపటి నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంక్‌ కార్డులను అందుబాటులో ఉంచుతామన్నారు.. ఈనెల 18వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్టు తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. మరోవైపు ఇప్పటికే ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఈనెల 3నుంచి ఐదు విడతలుగా నిర్వహించిన పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఈ పరీక్షలకు 83,822మంది దరఖాస్తు చేయగా.. 78,066మంది హాజరైనట్టు తెలియజేవారు. అయితే, ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు.. వైద్యవిద్యలో ప్రవేశాలకోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్‌) నిర్వహిస్తుండడంతో.. ఎంసెట్‌లో ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించారు.. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే నిర్వహిస్తుంన్నదున ఎం స్థానంలో పీ ని చేర్చి ఈఏపీసెట్‌గా మార్పు చేశారు అధికారులు.

ఏపీ ఈఏపీ సెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాకు మొత్తంగా 2,59,688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఈ నెల 14 అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.. గత రెండేళ్లతో పోల్చుకుంటే అర్హులైన విద్యార్థుల శాతం తగ్గిపోయింది.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మాత్రం పెరిగినట్టు వెల్లడించారు.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. మరోవైపు.. ఫలితాల్లో ఈసారి అమ్మాయిలు వెనుకబడ్డారు.. మొదటి పది ర్యాంకుల్లో కనీసం ఒక్ ర్యాంకు కూడా సాధించలేకపోయారు.. మొదటి ర్యాంక్ అనంతపురం జిల్లాకు చెందిన కోయి శ్రీ నిఖిల్.. సెకండ్ ర్యాంక్ వరద మహంత్ నాయుడు, రాజాం, శ్రీకాకుళం జిల్లా నిలిచారు.

Related Articles

Latest Articles

-Advertisement-